రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాలని కలలు కంటున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తమిళ హీరో విజయ్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు.ఆయన అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు.ఆయన డ్యాన్స్ కు నేను పెద్ద ఫ్యాన్ ను అని అన్నారు.
పర భాషలలో తమ మార్కెట్ ను పెంచుకోవాలని కలలు కనే హీరోలు అక్కడ స్టార్స్ గా కొనసాగుతున్న వారిని ఇలా పొగడ్తలతో ముంచెత్తి వారి అభిమానులను ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీ అని ఈ ఉదంతం చూసిన సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.