బుల్లితెర మీద తన షోలతో వెండితెర మీద తన సినిమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ప్రస్తుతం అరడజన్ పైగా సినిమాలను లైన్ లో పెట్టారు.దీంతో ఆయన రానున్న మూడేళ్లు ఫుల్ బిజీ అయిపోయారు.అలాంటి ఎన్టీఆర్ కు తాజాగా గాయం అయ్యిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.దాని ప్రకారం గతవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి చేత వెళ్లకు గాయం అయ్యింది.ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడిన ఎన్టీఆర్ డాక్టర్స్ సలహా మేర ఒక చిన్నపాటి సర్జరీ చేయించుకున్నారట.
ప్రస్తుతం అందిన సమాచారం మేర ఎన్టీఆర్ ఈ సర్జరీ కారణంగా కొన్ని రోజులు షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదు అందుకే ఆయన జక్కన దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ తన 30వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కునున్నది.
ఈ వార్త వైరల్ అవుతుండడంతో సినీ అభిమానులు,సినీ విశ్లేషకులు అభిమానులను అలరించాడనికి మిమ్మల్ని మీరు కష్ట పెట్టుకోకండి అంటూ అని హీరోలకు తమ సందేశాన్ని ట్వీట్స్ చేస్తున్నారు.