NTR : మూవీకి మూవీకి హీరోలు చేంజ్ అవుతూ ఉండాలి కదా.. ఒకే లుక్‌లో కనిపిస్తే అభిమానులకు మజా వచ్చేదెలా. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఎన్టీఆర్ 30 తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ బరువు తగ్గి స్టైలిష్ లుక్‌లో వావ్ అనిపించేలా ఉన్నాడు. తాజాగా ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ ఒకటి బయటకు వచ్చింది. అది అభిమానులను మెస్మరైజ్ చేసేలా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి జపాన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు.
వెకేషన్ కోసం స్నేహితులిద్దరూ కలిసి వెళ్లారా? అని అనుకోకండి. ఇక్కడ ఈ నెల 21న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. ఈ స్టార్ హీరోలిద్దరూ ముందుగానే వెళ్లి అక్కడ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఎయిర్‌పోర్టులో దొరికి పోయాడు. ఆయన స్టైలిష్ లుక్ చూసిన వాళ్లందరూ అవాక్కవుతున్నారు. బాగా స్లిమ్ అయిపోయి.. మరింత యంగ్‌గా తయారైపోయాడు. ఆర్ఆర్ఆర్‌కి ఇప్పటికే ఎంత చేంజ్ ఉందో. ఎన్టీఆర్ ఫోటోలు చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా పైనే దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే తన ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొరటాల శివ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆచార్య రిజల్ట్ మళ్లీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకుంటున్నారని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ రీ రైట్ జరుగుతోందని.. నవంబర్‌లో సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. గరుడ పురాణం కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని ఎన్టీఆర్ 30 రూపొందనుందని సమాచారం. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
#NTR @tarak9999 is off to Japan for #RRRInJapan @RRRMovie pic.twitter.com/muspYBoDO3
— Vamsi Kaka (@vamsikaka) October 18, 2022