ఎన్ఠీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ నటించబోతున్న సినిమా కావడంతో దీనిని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఆవిష్కరించాలని అనుకున్నారు. దానికోసం స్క్రిప్ట్ లో కొరటాల మార్పులు చేయడానికి రెడీ అయ్యారు. ఇక హీరోయిన్ ని కూడా బాలీవుడ్ నుంచి తీసుకోవాలని భావించారు. అయితే ఎందుకనో మరల తారక్ కొరటాల మూవీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడనే మాట వినిపిస్తుంది. ఇక కథ మొత్తం చూసిన తర్వాత యూనివర్శల్ అప్పీల్ ఈ మూవీకి సెట్ కాదని భావించారని టాక్.
ఈ నేపధ్యంలో కొరటాలతో చేయబోయే సినిమాని కేవలం సౌత్ భాషలకి మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం సౌత్ లో స్టార్ హీరోయిన్స్ ని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక రష్మిక మందనని ముందుగా అనుకున్నారు. అయితే ఆమె రెమ్యునరేషన్ 5 కోట్లు డిమాండ్ చేయడంతో కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. కీర్తి సురేష్, తారక్ కాంబినేషన్ కూడా సావిత్రి, సీనియర్ ఎన్ఠీఆర్ తరహాలో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. త్వరలో కీర్తి సురేష్ పేరు అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక ఈ నెలలోనే సినిమా లాంచింగ్ కూడా జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎలాగూ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉంటుంది కాబట్టి ఈ మూవీని సౌత్ కి పరిమితం చేసినట్లు టాక్. ఒక వేళ సౌత్ బాషలలో హిట్ అయితే అప్పుడు హిందీలో డబ్ చేసి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. తాజాగా దుల్కర్, మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా కూడా సౌత్ లోనే ముందుగా రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చాక హిందీలో డబ్బింగ్ చేశారు. అక్కడ కూడా హిట్ అయ్యింది. అలాగే ఎన్ఠీఆర్, కొరటాల మూవీ కూడా రిలీజ్ తర్వాత వచ్చే బజ్, క్రేజ్ బట్టి హిందీలో డబ్బింగ్ చేద్దామని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.