ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ మూవీ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.ఈ మూవీని సుధాకర్ మక్కిలినేని,నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీకి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించనున్నారు.ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది.ఆర్.ఆర్.ఆర్ మూవీ అనంతరం ఎన్టీఆర్ రెండు నెలలు గ్యాప్ తీసుకోనున్నారు.
దీంతో కొరటాల శివ తన దృష్టిని మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన ఆచార్యపై సారించారు.ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఈ మూవీ రిలీజ్ అనంతరం కొరటాల శివ ఎన్టీఆర్ 30 షూటింగ్ ను ప్రారంభించనున్నారు.ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ మార్చిలో సెట్స్ పైకి వెళ్లనుంది.గతంలో జనతా గ్యారేజ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ మరోసారి కలిసి సినిమా చేస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాల నెలకొన్నాయి.