టెక్ ప్రియులు అందరూ కూడా ఏప్పుడా ఏప్పుడా అని ఎదురుచూస్తున్న విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్టకేలకు గ్రాండ్ గా లాంచ్ చేసింది మైక్రోసాఫ్ట్ సంస్థ… అంతేకాదు ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం ఇంతకు ముందెప్పుడూ చూడని సెక్యూరిటీ ఫీచర్లను కూడా అందిస్తుంది. ఇప్పటివరకు అందరూ కూడా విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను వాడుతున్నారు. దానిలో ఇప్పుడు పెరిగిపోయిన టెక్నాలజీ వలన మన వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుందా ఉండదా అనే గ్యారెంటీ లేదు..కానీ మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన విండోస్11 ఆపరేటింగ్ సిస్టం వలన కచ్చితంగా మన సిస్టమ్‌లో డేటా మరింత భద్రంగా ఉంటుంది. అయితే విండోస్ 10 నుండి 11 కి ఎలా మారాలో తెలియక చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వారికోసమే ఈ వీడియో.
ప్రస్తుతం ప్రతి ఒక్క మైక్రోసాఫ్ట్ యూజర్ వాడుతున్న, విండోస్10 ఆపరేటింగ్ సిస్టం నుంచి విండోస్11కు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణం 11 లో ఉన్న కొత్త సెక్యూరిటీ ఫీచర్లు యూజర్లను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే స్టార్ట్ మెనూ మల్టీ టాస్కింగ్ ఫీచర్‌తో అందుబాటులో ఉంది. అఫీషియల్ విండోస్11 ఆపరేటింగ్ సిస్టం మనకు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఓ ప్రముఖ సంస్థ చేసిన రివ్యూ ప్రకారం విండోస్11 ఇప్పుడున్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కంటే చాలా స్పీడును కలిగి ఉంది. ఈ స్పీడ్ వినియోగదారులకు తప్పకుండా నచ్చుతుందని ఆ సంస్థ ప్రకటించింది.

అయితే ఇప్పటివరకు వాడుతున్న సిస్టమ్స్ కాకుండా కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన హార్డ్‌వేర్‌లో గనుక మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేస్తే టాస్క్ రియాక్షన్ టైమ్ మనం ఊహించని స్పీడ్ లో పనిచేస్తుందట.. దీన్ని బట్టీ చూస్తే విండోస్11 వాడే యూజర్లు కొత్త పీసీని తీసుకుంటే ఆ ఎక్స్‌పీరియన్స్ వేరుగా ఉంటుంది. ఈ వెర్షన్ ఇప్పటి వరకూ మార్కెట్లో మనకు అందుబాటులో లేని ఎన్నో కొత్త సెక్యూరిటీ ఫీచర్లను కూడా అందిస్తోంది.
మీరు రీసెంట్‍గా విండోస్10తో నడిచే కొత్త పీసీని కొంటే.. వెంటనే విండోస్11కు అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. అది ఎలాగో ఎలాగో చూద్దాం.
- ముందుగా మీ పీసీ విండోస్11 కొత్త వెర్షన్‌ను సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి. విండోస్11కు సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్ పీసీ హెల్త్ చెక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు.
- మీ పీసీ కొత్త వెర్షన్‌ను సపోర్ట్ చేస్తుందని మెసేజ్ వస్తే.. మీ దగ్గరున్న ఇంపార్టెంట్ డేటా, డాక్యుమెంట్లు, యాప్స్అన్నింటినీ ముందుగానే వేరే హార్డ్ డిస్క్ లో జాగ్రత్తగా భద్రపరుచుకోండి..
- మీ కంప్యూటర్ బ్రౌజర్‌లో సెట్టింగ్స్ లోకి వెళ్తే అక్కడ అప్డేట్ & సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తోంది..అది క్లిక్ చేస్తే విండోస్ అప్డేట్ ఉంటాయి.

- ఇప్పుడు ‘Check for updates’ బటన్ మీద క్లిక్చేస్తే సరిపోతుంది. అప్పుడు మీ సిస్టమ్ విండోస్‌లో ఉన్న అప్డేట్లను చెక్చేస్తుంది. అప్పుడు మీకు విండోస్11 అనే అప్డేట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- మీకు విండోస్11 అప్డేట్ అందుబాటులో ఉంటే.. మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద అప్డేట్ ఫర్ విండోస్11 అని చూపిస్తుంది. సో, వెంటనే అప్డేట్ అయిపోండి..
ఇంకా విండోస్11 అప్డేట్ ప్రస్తుతం ఫ్రీ అఫ్ కాస్ట్ లో మనకు లభిస్తుంది. కావున విండోస్11కు ఎక్కువ మంది యూజర్లు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని స్పీడ్ కి యూజర్లు అందరూ అట్రాక్ట్ అవుతారు. అంతేకాదు ఇప్పటికైతే విండోస్11లో ఎటువంటి బగ్స్ కనిపెట్టలేదు.

ఇక విండోస్11లో ప్రత్యేకతలు గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే మెయిన్ మనం చెప్పుకోవాల్సింది స్టార్ట్ మెనూ గురించి దాన్ని ఈసారి చాలా ఆకర్షణీయంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేకాదు ఈ స్టార్ట్ మెనూ మల్టీ టాస్కింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది. మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ లేదా ఇతర రకాల విడ్జెట్ల నుంచి కొత్త విండోస్ వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొంత మంది యూజర్లు ఆల్రెడీ కొన్ని గంటల ముందే విండోస్11 ఎలా ఉందో చూసేశారు. మిగతా యూజర్లు కూడా అప్‌డేట్ చేసుకునేలా మైక్రోసాఫ్ట్ చూస్తోంది. 2022 మధ్య నాటికి మెజార్టీ మైక్రోసాఫ్ట్ యూజర్లకు ఈ విండోస్11 పవర్‌ను పరిచయం చేయాలని మైక్రోసాఫ్ట్ చూస్తోంది. కొత్త హార్డ్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉన్న రీసెంట్‌గా కొన్న కంప్యూటర్లలో 2022 కంటే ముందుగానే మనం మైక్రోసాఫ్ట్ కొత్త ఆపరేటింగ్ సిస్టంను ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు ఇంతకు ముందే ప్రకటించారు. సో, అదండీ ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ని త్వరగా మీరుకూడా అప్డేట్ చేసుకొని ఎంజాయ్ చేయండి.