Nora Fatehi : డ్యాన్స్ మూవ్స్‌తో చెలరేగిపోవాలన్నా, ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిపోవాలన్నా అది బాలీవుడ్ బ్యూటీ, డ్యాన్సింగ్ దివా నోరా ఫతేహికే సొంతం. ఈ అందాల తార డ్యాన్స్ షోలో తన ఫ్యాషన్ లుక్స్‌తో చేసే హంగామా మామూలుగా ఉండదు. చాలా మంది ఫ్యాషన్ ప్రియులు నోరా ఫతేహిని స్ఫూర్తిగా తీసుకుని తమ లుక్స్‌ను అప్‌డేట్ చేసుకుంటారంటే అతిశయోక్తి కాదేమో. అందుకే ఆమె ధరించే ప్రతి అవుట్‌ఫిట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతాయి.

తాజాగా జరిగిన ఓ అవార్డ్స్ ఫంక్షన్ కోసం నోరా ఫతేహి అదిరిపోయే మెరిసేటి పసుపు రంగు కటౌట్ గౌన్ ధరించి రెడ్ కార్పెట్‌పైన తళుక్కుమంది. బ్రెస్ట్, నడుము అంతటా కటౌట్స్‌తో వచ్చిన వన్ షోల్డ్‌ర్ గౌనులో నోరా ఓ తారలా మెరిసింది. గౌను ఓ వైపు వచ్చిన డ్రమాటిక్ స్లిట్ తో తన థైస్ అందాలను ప్రదర్శిస్తూ అందాల దాడి చేసింది ఈ బ్యూటీ.

ఇన్ని కటౌట్స్ ఉన్నా నోరా లుక్స్ మాత్రం ఆసమ్ అని అంటున్నారు నెటిజన్లు. ఏ దుస్తులు ధరించినా ఆమె స్ట్రక్చర్‌కి పెర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయంటూ కితాబిస్తున్నారు.

ఈ ఎల్లో కలర్ కటౌట్ అవుట్‌ఫిట్‌కు సూట్ అయ్యేలా చేతికి స్టేట్‌మెంట్ బ్రేస్‌లెట్ పెట్టుకుంది నోరా. చేతి వేళ్లకు మెరిసేటి కాక్‌టెయిల్ ఉంగరాన్ని అలంకరించుకుంది. పాదాలకు బ్లాక్ కలర్ పాయింటెడ్ హీల్స్ వేసుకుంది. నడుము, భుజం మీద బ్రూచ్‌లను పెట్టుకుని తన లుక్‌కు మరింత మెరుగులు దిద్దింది.

ఈ మధ్యనే మరో కటౌట్ గౌన్ ను ధరించి అందరిని మెస్మరైజ్ చేసింది నోరా. వన్ షోల్డర్ బాడీ హగ్గింగ్ డ్రెస్‌లో తన ఫిగర్ ను పెర్ఫెక్ట్‌గా చూపించి కుర్రాళ్ల మనసు దోచేసింది.

సోషల్ మీడియాలో నోరా ఫతేహికి మంచి ఫాలోయింగ్ ఉంది. నోరా పోస్ట్ చేసే హాట్ పిక్స్ కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని మరి ఫాలోవర్స్ ఎదురుచూస్తుంటారు. ఫ్యాన్స్‌ను నిరుత్సాహపరచడం ఇష్టంలేని నోరా కుదిరినప్పుడల్లా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆ పిక్స్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. ఇప్పటి వరకు నోరా షేర్ చేసిన ప్రతి ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
