పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాకతీయుల కాలం నాటి కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ని ముందుగా క్రిష్ ఫైనల్ చేశాడు.
అయితే ఇప్పుడు ఆమె స్థానంలో నోరా ఫతేహి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించబోతుందని టాక్. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన కీలక సన్నివేశాలని క్రిష్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతుందని టాక్. వీలైనంత వేగంగా ఈ మూవీని పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేసి రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టబోతున్నాడని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో గ్యాప్ లేకుండా పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సమాచారం.
ఇక ఈ మూవీ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తాడని టాక్ ఉంది. అయితే ఎంత వరకు సాధ్యం అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పూర్తి ఫోకస్ అంతా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ పెట్టనున్న కారణంగా హరీష్ శంకర్ సినిమాని వాయిదా వేసే అవకాశం ఉంది. ఒక వేళ పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడితే హరీష్ విజయ్ దేవరకొండతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.