Nora Fatehi : బాలీవుడ్ నటి , అద్భుతమైన డ్యాన్సర్ అయిన నోరా ఫతేహి తన పవర్ ఫుల్ ఫ్యాషన్ దుస్తుల ఎంపికలతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. విభిన్న స్టైల్ స్టేట్‌మెంట్‌లతో ప్రయోగాలు చేయడంలో ఈ బ్యూటీ కి మంచి టాలెంట్ ఉంది. బాడీకాన్ డ్రెస్‌ల నుండి రెడ్ కార్పెట్ రెడీ గౌన్‌లు , ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తుల వరకు, నోరా అన్నింటినీ ధరించి ఎప్పుడూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. నోరా ఫతేహి ప్రస్తుతం డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లా జా కు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ప్రతి ఎపిసోడ్ లో నోరా అద్భుతమైన అవుట్ ఫిట్స్ ధరించి బుల్లితెరపైనా మంటలు రేపుతుంటుంది.

Nora Fatehi : ఇటీవల, నోరా బ్లాక్ అండ్ వైట్ స్ట్రాప్‌లెస్ గౌను ధరించి డిస్నీ యువరాణిగా కనిపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది. షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ తీసుకుని ఈ భామే అదే అవుట్ ఫిట్ తో క్రేజీ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

నోరా ఫతేహి మోనోక్రోమ్ స్ట్రాప్‌లెస్ గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది. ప్లంగింగ్ స్వీట్ హార్ట్ నెక్ లైన్ , ఆఫ్ షోల్డర్స్ తో నడుముదగ్గర వచ్చిన గాదేర్డ్ డీటెయిల్స్ లాంగ్ ట్రైన్ అవుట్ ఫిట్ కె వన్నెను తీసుకు వచ్చాయి.

ఈ మధ్యనే నోరా ప్రముఖ భారతీయ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన అందమైన షిమ్మరి ఐవరీ లెహంగా చీరలో నోరా ఫతేహి అందరిని ఆశ్చర్యపరిచింది. సాఫ్ట్ మేకప్ వేసుకుని తన కురులను లూజ్ గా వదులుకుని శారీ లుక్ లో కత్తిలా కనిపించింది.

ఈ శారీ కి జోడిగా సన్నటి స్ట్రాప్స్ తో వచ్చిన డీప్ నెక్ బ్లౌజ్ వేసుకుని ఏడ అందాల ప్రదర్శనతో యూత్ లో హీట్ పెంచింది. ఈ శారీ పిక్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేసింది.
