Nora fatehi : అందం, అభినయం, డ్యాన్సింగ్ స్టైల్స్ తో మంత్రముగ్ధులను చేయడంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. పర్ఫెక్ట్ ఫిగర్ ను మెయిన్ టైన్ చేస్తూ స్టైలిష్ అవుట్ ఫిట్స్ ను ధరిస్తూ నిత్యం ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది నోరా ఫతేహి. తన ప్రతిభకు మాత్రమే కాదు , ఆమె వినయపూర్వకమైన వ్యక్తిత్వానికి కూడా భారీ అభిమానులు ఉన్నారు. ఈ మొరాకో బ్యూటీ కి ఇన్ స్టాగ్రామ్ లో 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Nora fatehi : తన ఫాలోవర్స్ ను ఇంప్రెస్స్ చేసేందుకు ఈ చిన్నది డిజైనర్ అవుట్ ఫిట్స్ తో చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా నోరా ఫతేహి పసుపు పూసలతో డిజైన్ చేసిన గౌనులో దిగిన చిత్రాల ను పోస్ట్ చేసి మంత్రముగ్ధులను చేస్తుంది. హాల్టర్ స్ట్రాప్‌లు, డీప్ నెక్‌లైన్ కలిగిన బాడీ కాన్ డ్రెస్ వేసుకుని బార్బీ బొమ్మలా కనిపిస్తూ నోరా ఫతేహి రెడ్ కార్పెట్ లుక్స్ ను అందిస్తోంది.

నోరా ఫతేహి ధరించిన ఈ గౌను అంతర్జాతీయ డిజైనర్ ఫ్జోల్లా నీలా ఫాల్-వింటర్ 2022’23 సేకరణ నుంచి ఎన్నుకుంది. ఈ ఫ్యాషన్ లేబుల్ వెబ్‌సైట్ ప్రకారం నోరా ఫతేహి గౌను విలువ రూ.3.78 లక్షలు. నోరా ఫతేహి కలలు కనే లుక్ వెనుక ఉన్న స్టైలిస్ట్ ఆస్తా శర్మ. లెన్స్ వెనుక ఉన్న ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ తేజస్ నెరుర్కర్. వీరిద్దరూనోరా అందాలను మరింత హైలెట్ చేశారు.

మత్స్య కన్య ఆకారంలో , స్వీట్ హార్ట్ నెక్‌లైన్ ఉన్న స్విస్ డాట్ ఎంబ్రాయిడరీ కలిగిన దుస్తుల్లో నోరా ప్రత్యేకంగా కనిపించింది. నోరా ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా హూప్ ఇయర్ రింగ్స్ ను ఎన్నుకుంది. ఈ మిరుమిట్లు గొలిపే డ్రెస్ కు మరింత వన్నె తెచ్చేందుకు పాయింటెడ్ సిల్వర్ హీల్స్ ను వేసుకుంది. బెర్రీ టోన్డ్ లిప్ కలర్ పేదలకు వేసుకుని , కనులకు పసుపు ఐ ష్యాడో , వింగెడ్ ఐ లైనర్ , ప్రకాశవంతమైన చర్మంతో హాట్ డాల్ లా కవ్వించింది.
