తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న యంగ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకడు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. వరుసగా ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘భీష్మ’ కాంబినేషన్లో మరో చిత్రాన్ని చేస్తోన్నాడు. దీంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు కూడా భారీగా ఏర్పడ్డాయి.
వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ సినిమా జూన్ 5వ తేదీ నుంచి రెగ్యూలర్ షూటింగ్ను జరుపుకోబోతుంది. ఇందులో నితిన్తో పాటు రష్మిక మందన్నా కూడా పాల్గొనబోతుందని తెలిసింది. ఇది ఇంకా ప్రారంభం కాకముందే నితిన్ మరో సినిమాను కూడా ఓకే చేసుకున్నాడు. దీన్ని ప్రముఖ రచయిత దర్శకుడు వక్కంతం వంశీ రూపొందించబోతున్నాడు.

నితిన్ స్పీడ్ మామూలుగా లేదు :
ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్లలో నితిన్ ఒకేసారి పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాడట. అంటే.. రెండు వారాలు ఓ సినిమాకు.. మరో రెండు వారాలు ఇంకో సినిమాకు డేట్స్ కేటాయించాడని తెలిసింది. ఈ రెండింటినీ సెప్టెంబర్ నాటికి పూర్తి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాడట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ రెండూ ఒకే సమయంలో కంప్లీట్ అవుతాయి.
ఒకవైపు వెంకీ కుడుములతో మరోవైపు వక్కంతం వంశీతో సినిమాలు చేయబోతున్న నితిన్.. వీటితో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లోనూ మరో ప్రాజెక్టును చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే దీన్ని మాత్రం ఆ రెండు చిత్రాలు పూర్తైన తర్వాతనే మొదలు పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంటే.. నితిన్ వరుసగా మూడు ప్రాజెక్టులతో రాబోతున్నాడన్న మాట.
కొంత కాలంగా భారీ విజయం కోసం వేచి చూస్తోన్న నితిన్.. చివరిగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్గా మిగిలింది. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్ను సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నితిన్.. ఇప్పుడు మూడు చిత్రాలను లైన్లో పెట్టాడు. మరి ఈ సారైనా అతడికి హిట్ వస్తుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారని చెప్పాలి