Nithyananda: తెలుగు ప్రజలకు నిత్యానంద స్వామి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రతి ఒక్కరూ 3 వ కన్ను తెరవవచ్చు.. నా భక్తులందరిని నేను మూడో కన్ను తెరిపించేలా చేస్తాను.. దానికోసమే ఆ పరమశివుడు నన్ను ఇక్కడికి పంపాడు. అని మాయ మాటలు చెబుతూ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు.
ఇలాంటి మాటలు చెప్పి ఎక్కడో తమిళనాడులో పుట్టిన ఒక వ్యక్తి.. ఇప్పుడు నిత్యానంద స్వామిలా ఒక సొంత దేశాన్ని సృష్టించే స్థాయికి ఎ.దిగాడు. ప్రజలందరికీ ఒక్కరోజులో దేవుడుగా మారిపోయాడు. కానీ గుడి ఎనక నా సామీ.. అన్నట్లు ఈ స్వామి బండారం మొత్తం బయటపడింది. ఒక అత్యాచారం కేసులో ఈ స్వామి ఇరుక్కున్నాడు. ప్రస్తుతం ఇతడి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.
గత కొంతకాలంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి.. ఏకంగా శ్రీలంక అధ్యక్షుడికి ఒక లేఖ రాశాడు. ఇక తాజాగా ఈ లేఖకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అత్యాచార ఆరోపణలతో గత కొంతకాలంగా కొట్టుమిట్టాడుతున్న ఈ స్వామి శ్రీ లంకలో రాజకీయపరంగా షెల్టర్ కోరుతున్నట్లు తెలుస్తుంది. భారతదేశ నుంచి పారిపోయిన ఈ వ్యక్తి తన ఆరోగ్యం బాలేదు అని.. తనకు వైద్య చికిత్సలు అందించాలని శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాసినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఆ లేఖలో శ్రీలంకలో పెట్టుబడులు పెట్టేందుకు తాను చేసిన కృషిని గురించి కూడా ఆ లేఖలో వివరించినట్లు తెలుస్తుంది. ఇక నిత్యానందకు అవసరమైన వైద్య చికిత్స కు తాము ఖర్చులు భరిస్తాము అన్నట్లు కైలాస దేశ మంత్రి వెల్లడించినట్లు తెలుస్తుంది. మొత్తానికి మూలిగే నక్కపైన తాటికాయపడినట్లు ఈ నిత్యానంద స్వామికి అనారోగ్య సమస్య ఎదురయింది.
Nithyananda:
ఇన్ని రోజులు దేవుడు పంపించిన స్వామీజీలా.. ట్రీట్ చేసిన ప్రజలు ప్రస్తుతం ఇతడి పై మండిపడుతున్నారు. మాయమాటలు చెప్పి మాయ చేసాడంటూ మరికొందరు విరుచుకుపడుతున్నారు. చివరకు నిత్యానంద స్వామి పరిస్థితి ఏమవుతుందో చూడాల్సి ఉంది.