Nithya Menon: తెలుగు, తమిళంలో బాగా పాపులర్ అయిన హీరోయిన్ల జాబితాలో నిత్యామీనన్ టాప్ లో ఉంటుంది. తెలుగులో హీరో నితిన్ తో కలిసి పలు హిట్లు అందుకున్న నిత్యామీనన్.. టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా చేసింది. తెలుగులో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తో ‘బీమ్లా నాయక్’ సినిమాలో నటించిన నిత్యా మీనన్ తాజాగా ధనుష్ తో కలిసి ‘తిరు’ సినిమాలో మెరిసింది.
నిత్యామీనన్ సినిమాలను ఎంచుకునే విధానం చాలా స్పెషల్ గా ఉంటుందని సినీ ఇండస్ట్రీలో టాక్. తన క్యారెక్టర్ కు తగిన గుర్తింపు, స్కోప్ ఉంటేనే కానీ నిత్యామీనన్ సినిమాలకు ఒప్పుకోదట. దీని వల్లే ఆమెకు చాలా అవకాశాలు రావట్లేదని టాక్ ఉండగా.. దీని వల్లే నిత్యా మీనన్ కెరీర్ లో మంచి సినిమాలు వచ్చాయనే వాళ్లు కూడా ఉన్నారు.
ఇలా చాలా ఆలోచించి నిత్యామీనన్ సినిమాలకు ఓకే చెబుతున్న కారణంగానే ఆమె సినిమాలు ఆరు నెలకు ఒకటి లేదంటే ఏడాదికి ఒకటి వస్తున్నాయని సినీ పండితులు అంటున్నారు. అయితే ఈ మధ్యన తెలుగులో నిత్యామీనన్ కు మంచి అవకాశాలు వస్తుండగా, ధనుష్ తో సినిమా తర్వాత తమిళంలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయట. కానీ ఆమె మాత్రం కాల్షీట్స్ ఎవరికీ ఇవ్వడం లేదట.
Nithya Menon:
అవకాశాలు వస్తున్నా కానీ నిత్యామీనన్ ఎందుకు సినిమాలకు ఒప్పుకోవడం లేదనే చర్చ సాగుతుండగా.. ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిత్యామీనన్ ఓ బాలీవుడ్ సంస్థ కోసం తన కాల్షీట్స్ ని ఉంచుకుందని, ఆ సంస్థతో పలు ప్రాజెక్టుల కోసం నిత్యామీనన్ ఎదురుచూస్తోందని తెలుస్తోంది. అయితే ఆ సంస్థతో ప్రాజెక్టులు చేయడం అంత సులభం కాదని, మరి అలాంటప్పుడు అందివచ్చిన అవకాశాలను నిత్యామీనన్ వదులుకోవడం ఏంటనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.