సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే హీరో, హీరోయిన్స్ కి సంబందించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతాయి. వారు చదువుకున్న స్కూల్ నుంకో, లేదంటే ఫ్రెండ్స్ నుంచో, అలాగే వారు చిన్నప్పుడు నటించిన సినిమాల నుంచో అలాంటి ఫోటోలు, వీడియోలు బయటకి వస్తాయి. ఇప్పుడు ట్విట్టర్ లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ చిన్నారి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తుంది. ఆ వీడియో బ్యాగ్రౌండ్ లో మలయాళీ సాంగ్ వస్తుంది. అందులో రెండు, మూడు సినిమాలకి సంబందించిన సన్నివేశాలు ఉన్నాయి.
Such cuteness Nithya😍 pic.twitter.com/BQaS9rPAou
— Soul Wanderer🎆 (@dumbinfidel) September 19, 2022
అలాగే ఒక బిట్ లో హీరోయిన్ టబు కూడా కనిపిస్తుంది. టబు హీరోయిన్ గా నటించిన సినిమాలో కూడా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. అయితే ఇప్పుడు ఆ చైల్డ్ ఆర్టిస్ట్ సౌత్ లో స్టార్ హీరోయిన్. చిన్నారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఆ నటి ఎవరనే విషయాన్ని ఈజీగా చెప్పొచ్చు.
నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నిత్యా మీనన్ ఆ చిన్నారి. నిత్యా మీనన్ మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి తరువాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన సినిమాలలో విజువల్స్ ని జోడించి ఒక వీడియోగా చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ అవుతుంది.