సౌత్ ఇండియాలో టాలెంటెడ్ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న కథానాయిక నిత్యా మీనన్. తెలుగులో మొదటి సినిమా అలా మొదలైందితోనే నటిగా ఈ మలయాళీ కుట్టి ఆకట్టుకొని తరువాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ సరసన కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక సినిమాలలో ఎప్పుడు పద్ధతైన పాత్రలలోనే నిత్యా మీనన్ కనిపిస్తూ ఉంటుంది. తెలుగులో ఆమె చివరిగా పవన్ కళ్యాణ్ కి జోడీగా బీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది.
ఇక ఈ మధ్యనే హిందీలోకి కూడా అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ వరుస అవకాశాలని సొంతం చేసుకుంటుంది. ఇక తాజాగా హిందీలో ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె బోల్డ్ సన్నివేశాలలో నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇందులో ఒక లెస్బినియన్ గా నటించింది. గతంలో అః అనే సినిమాలో నిత్యా మీనన్ లెస్బినియన్ గా నటించింది. అయితే అందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించింది అని అందరూ భావించారు. అయితే తాజాగా హిందీ వెబ్ సిరీస్ లో మాత్రం ఆమె ఒక అమ్మాయితో ఏకంగా కారులో ఆధార చుంబనాలు చేస్తూ షాక్ ఇచ్చింది.
ఇలాంటి ఇంటిమేట్ సన్నివేశాలని ఇది వరకు నిత్యా మీనన్ ఏ సినిమాలో కూడా చేయలేదు. కానీ మొదటి సారి అది కూడా అమ్మాయితో రొమాంటిక్ సన్నివేశాలలో కనిపించేసారికి ఆమె అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. హిందీలో బ్రీత్ వెబ్ సిరీస్ సీజన్ 2 లో నిత్యామీనన్ నటిస్తుంది. ఇందులో ఆమె పాత్ర ఇలా లెస్బినియన్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కథ డిమాండ్ మేరకు అలాంటి బోల్డ్ సన్నివేశాలలో ఆమె నటించాల్సి వచ్చిందని సమాచారం. ఏది ఏమైనా నిత్యా మీనన్ ఆధార చుంబనం వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.