టాలెంటెడ్ యాక్టర్ గా సౌత్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి నిత్యా మీనన్. ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువగానే ఉన్న కచ్చితంగా తన మార్క్ ఉండే విధంగా చూసుకుంటుంది. ఆ అందరి హీరోయిన్స్ తరహాలో కమర్షియల్ కథల కోసం పరుగులు పెట్టదు. అలాగే స్టార్ హీరోయిన్ అయిపోయి కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకోవాలనే ఆలోచన ఉండదు. కంటెంట్ బేస్ కథలని ఎంపిక చేసుకుని తన బ్రాండ్ ఇండస్ట్రీలో ఉండిపోయే సినిమాలు చేయాలని మాత్రం అనుకుంటుంది. ఈ నేపధ్యంలోనే అలాంటి కథలనే ఎంపిక చేసుకుంటుంది.
చివరిగా నిత్యా మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించింది. అలాగే తమిళ్ లో ధనుష్ కి జోడీగా తీరు అనే సినిమాలో సందడి చేసింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి. ఇదిలా ఉంటే సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నిత్యా సందడి చేస్తుంది. అన్ని భాషలో మంచి కంటెంట్ బేస్ వెబ్ సిరీస్ లు ఎంపిక చేసుకుంటూ తన ఐడెంటిటీ కనిపించే విధంగా దూసుకుపోతుంది. హిందీలో బ్రీత్ 2 వెబ్ సిరీస్ లో అభిషేక్ బచ్చన్ భార్య పాత్రలో నిత్యా మీనన్ కనిపించింది.
అలాగే మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే తెలుగు అంథాలజీ వెబ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ నిత్యా కనిపిస్తుంది. ఇక తాజాగా తమిళ్ లో వండర్ విమెన్ అనే వెబ్ సిరీస్ లో నిత్య నటించింది. ఈ సిరీస్ లో ఆమె గర్భంతో ఉన్న మహిళ పాత్రలో సందడి చేయనుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కూడా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం నిత్యా మీనన్ గర్భంతో ఉన్నట్లు ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రెగ్నెంట్ లుక్ అంత క్యూట్ గా ఉండదు. అయినా నోరా పాత్ర చేయడాన్ని నేను ఆశ్వాదించాను. నేను నిజంగా ప్రెగ్నెంట్ అయితే కాదు అని కామెంట్ పెట్టింది.