బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ ల తరువాత యువ హీరో నితిన్ సూపర్ హిట్ కోసం పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీని నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట మూవీస్ నిర్మిస్తుంది.ఈ మూవీలో నితిన్ సరసన ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా క్యాథరిన్ తెరిసాను ఫైనల్ చేసినట్లు సమాచారం.
భీష్మ,మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్ నితిన్ తో ముచ్చటగా మూడవసారి మాచర్ల నియోజకవర్గం మూవీకి కలిసి పని చేస్తున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ మూవీ ప్రేక్షకులకు ముందుకు రానున్నది.