మాస్ట్రో మూవీ ఓటిటి రిలీజ్ తో 15 కోట్లు ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్ నితిన్ తో మరో చిన్న సింపుల్ ఓటిటి సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నారట.దీనికి నితిన్ కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ శిష్యుడు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో మాచర్ల నియోజకవర్గం అనే పొలిటికల్ యాక్షన్ మూవీ చేస్తున్న నితిన్ ఈ మూవీ అనంతరం మంచి కథ దొరికితే ఓటిటి కోసం మూవీ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట.ప్రస్తుతం ఈ సినిమా కోసం కథ చెప్పడానికి వస్తున్న దర్శకులకి నితిన్ తక్కువ రోజులలో షూటింగ్ కంప్లీట్ చేయాలనే నిబంధన పెడుతున్నారట.మరి నితిన్ నిబంధనలను ఫుల్ ఫిల్ చేసే దర్శకుడు దొరుకుతారో లేదో వేచి చూద్దాం.