Nithin తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోల్లో నితిన్ ఒకడు. యూత్ ఫుల్ సినిమాలు, లవ్ స్టోరీస్ తీయడంలో నితిన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నితిన్.. అనేక హిట్, ప్లాఫులను చూశాడు. ఇష్క్ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కిన నితిన్.. చివరగా చేసిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
యూత్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ పేరుతో కొత్త ప్రయోగాన్ని చేసి విఫలమయ్యాడు. నితిన్ తండ్రి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా.. ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్నా కానీ తర్వాత మాత్రం ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహపరిచింది.
నితిన్ సినిమాలు అంటే కనీసం యావరేజ్ గా ఉంటాయనే టాక్ ఉంది. అందుకే కలెక్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. కానీ మాచర్ల నియోజకవర్గం పరిస్థితి మాత్రం వేరేలా ఉండింది. ఇక ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ అయినా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. ఓటీటీలో రిలీజ్ కాకపోవడానికి కారణం.. సినిమా థియేటర్ కలెక్షన్లలో వచ్చిన నష్టాన్ని ఓటీటీతో భర్తీ చేయాలని నిర్మాత అనుకోవడమే అని టాక్.
Nithin
సినిమా విడుదలకు ముందు ఉన్న రేట్, ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు అడుగుతున్న రేట్ లో చాలా వ్యత్యాసం ఉండంటంతో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. కానీ ఈ సినిమా వల్ల ఎంతో కొంత బాగా ఉన్న నితిన్ మార్కెట్ పరిస్థితి దారుణంగా మారిందని, నితిన్ మార్కెట్ ను ఈ సినిమా దెబ్బతీసిందనే టాక్ ఉంది. మరి నితిన్ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తాడో చూడాలి.