ట్రాఫిక్ లో కొందరు ఊరకనే హారన్ కొడుతూ విసిగిస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల శబ్ద కాలుష్యమే కాకుండా ఎదుటివారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.జనాభా ప్రాతిపదికన ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశమైన భారత దేశం నిపుణుల హెచ్చరికను సీరియస్ గా తీసుకుంది.
తాజాగా ఈ విషయంపై కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ త్వరలో మన దేశంలో బండి హారన్ లాగా సంగీత వాయిద్యాల శబ్దాలను పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.ప్రస్తుతం ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నాం అది పూర్తయ్యాక దీనికి సంబంధించి ఒక చటాన్ని రూపొందిస్తామని అన్నారు.