Nikki Tamboli : ప్రీ-డ్రేప్డ్ చీరలు పండుగ డ్రెస్సింగ్‌కు కరెక్ట్ గా సెట్ అవుతాయి. అవి సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా ధరించడానికి సులభంగా ఉంటాయి. ఎవరైనా ఎత్నిక్ అవుట్ ఫిట్ లో పండుగ రోజు కనిపించాలనుకున్నప్పుడు ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి . దీపావళి, నవరాత్రి , దసరా వంటి విస్తృతమైన పండుగ సీజన్ తర్వాత, భారతదేశంలో వివాహాల సీజన్ పూర్తి స్వింగ్‌లో ప్రారంభమైంది. మరి భారతీయ వివాహాలు అంటే ఓ రేంజ్ లో ఉంటాయి. అగ్రశ్రేణి స్టైలింగ్ దుస్తులతో అదిరిపోయే మేకప్‌తో మహిళలు అందరిని అమితంగా ఆకట్టుకుంటారు. తాజాగా నిక్కీ తంబోలి అలాంటి దుస్తులనే ధరించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. తన అందాల సోయగాలతో ఫ్యాన్స్ కు చెమటలు పట్టించింది.

Nikki Tamboli : నిక్కీ తంబోలి వివాహ సీజన్‌కు అవసరమైన అదిరిపోయే చీరను తన వార్డ్‌రోబ్ లో జత చేసింది. ఆమె డిజైనర్ లేబుల్ అమిత్ GT నుండి అద్భుతమైన డీప్ హ్యూడ్ ప్రీ-డ్రేప్డ్ చీరను ధరించింది ఉత్కంఠభరితంగా కనిపించింది. హాల్టర్ నెక్‌లైన్, రిబ్బెడ్ బస్ట్‌లైన్ తో పాటు ముందు భాగంలో వివరణాత్మక ప్లీట్‌లు ఉన్నాయి. మోనోక్రోమటిక్ లుక్ లో అంచుని జోడించి విశాలమైన అలంకరించబడిన నడుము బెల్ట్ ను వేసుకుని కుర్రాళ్లను కవ్వించింది.

నిక్కీ కనిష్ట ఆభరణాలతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది. చెవులకు అందమైన ఇయర్ స్టడ్స్ , చేతి వేళ్ళకు ఉంగరాలు అలంకరించుకుంది. వెనుక భాగంలో ఉన్న ఓపెన్ ఆమె సొగసులను మరింత అట్రాసిటివ్ గా మలచింది. ఈ రెడీ మేడ్ చీరలో దివి నుంచి భువికి చేరిన అప్సరసలా మెరిసింది నిక్కీ తంబోలి. తన ఒంపుసొంపులను , వయ్యారాలు చూపిస్తూ ఈ బ్యూటీ కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది.

ఈ చీరకు తగ్గట్లే మేకోవర్ అయ్యింది ఈ భామ. కనురెప్పలకు గ్లిట్టరింగ్ ఐ షాడో , బ్లాక్ ఐ లైనర్ , మస్కారా వేసుకుంది. పెదాలకు నిగనిగలాడే పెదవి రంగు దిద్దుకుని తన గ్లామరోస్ లుక్స్ తో అందరిని క్లీన్ బౌల్డ్ చేసింది.
