Nikki Tamboli : నిక్కీ తంబోలి ఫ్యాషన్ సెన్స్ ఎప్పటికీ బోరింగ్‌గా ఉండదు. ఈ దివా బోల్డ్ వార్డ్‌రోబ్ కలెక్షన్స్ తో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడదు. అందుకు ఆమె ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లే రుజువుగా ఉంటుంది. ప్రీ-డ్రేప్డ్ చీరలు లేదా అద్భుతమైన గౌన్‌లు కావచ్చు, పండుగ సీజన్‌లో ఆమె ఫ్యాషన్ ఎంపికలు ఉత్తమమైనవి గా నిలుస్తాయి . తాజాగా ఈ బ్యూటీ గ్లామరస్ సిల్వర్ షీర్ చీర కట్టుకుని సాంప్రదాయ డ్రెస్సింగ్‌కు ఆధునిక ట్విస్ట్‌ను జోదించి కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది.

క్లోతింగ్ బ్రాండ్ లేబుల్ డి నుంచి ఈ సిల్వర్ డ్రేప్ చీరను ఎన్నుకుంది నిక్కీ తంబోలి. చారల వివరాలు కలిగిన ఈ షీర్ బేస్ శారీలో నిక్కీ ఎంతో హాట్ గా కనిపించింది. ఏదైనా పార్టీ కి అటెండ్ అవ్వాలంటే ఈ చీర పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.

ఈ చీరకు జోడిగా నిక్కీ వెండి రంగులో ప్లైన్ గా వచ్చిన నెక్‌లైన్‌ని కలిగిన స్ట్రాపీ బ్యాక్‌లెస్ బ్లౌజ్‌ని ఎంచుకుంది. నిక్కీ నో-యాక్సెసరీ లుక్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది.

ఈ శారీ కి తగ్గట్లుగా ఆకర్షణీయమైన మేకప్‌తో తన లుక్ ను పూర్తిచేసింది. ఆమె తన కురులను లూస్ గా వదులుకుంది. స్టన్నింగ్ మేకప్ తో ఎరుపు రంగు లిప్ స్టిక్ ను పెడాలకు వేసుకుని కుర్రాళ్ళ మనసు దోచేసింది.

రీసెంట్ గా నిక్కీ తంబోలి ఉత్కంఠభరితమైన ఫ్యూజన్ నంబర్‌ను ధరించి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిక్కీ క్లోతింగ్ బ్రాండ్ లేబుల్ D నుండి బంగారు సీక్విన్స్ తో డిజైన్ చేసిన చీరను ఎంచుకుని ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసింది. ఈ శారీ కి థైస్ దగ్గర వచ్చిన డ్రమాటిక్ స్లిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

నిక్కీ ధరించైనా బ్యాక్‌లెస్ బ్లౌజ్ వెనుక భాగంలో టై-నాట్ వివరాలు ముందు భాగంలో ర్యాప్ ప్యాటర్న్ లు లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్స్పిరేషన్ ను అందిస్తున్నాయి . ఈ లుక్ లోనూ నిక్కీ తన ‘నో యాక్సెసరీస్’ పరంపరను కొనసాగించింది.

ఈ మధ్యనే నిక్కీ తంబోలి రెడ్ హాట్ కో-ఆర్డ్ సెట్ ను ధరించి రెడ్ కార్పెట్ ఫ్యాషన్ ను ప్రమోట్ చేసింది. తన గ్లామ్ బార్‌ను మరింత పెంచడానికి ఒక ఏ-లైన్ స్కర్ట్ , సీక్విన్డ్ బ్లౌజ్‌తో జత చేసింది.

నిక్కీ తన దుస్తులకు మరికొంత డ్రమాటిక్ లుక్ ను జోడించడానికి దుస్తులతో పాటు పొడవాటి రెడ్ కేప్‌ను ధరించింది. ఈ బ్యూటీ చక్కని పోనీటైల్ వేసుకుని మోనోక్రోమాటిక్ టచ్ తో అందరిని మెస్మెరైజ్ చేసింది.
