Nikki Tamboli : అందాలను ఆరబోయడంలో బాలీవుడ్ తారలు ముందువరుసలో ఉంటారు. హాట్ హాట్ ఫోటో షూట్ లతో కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తుంటారు. ఎత్నిక్ దుస్తుల నుంచి మోడరన్ అవుట్ ఫిట్స్ వరకు అన్నింటిని ధరిస్తూ లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నిక్కీ తంబోలి యూనిక్ ఆవుట్ ఫిట్ ను ధరించి తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.

Nikki Tamboli : నిక్కీ తంబోలి తన లేటెస్ట్ క్యాజువల్ లుక్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. బోల్డ్ ప్లంగింగ్ నెక్‌లైన్‌తో ఆకర్షణీయమైన స్ట్రాపీ డీటెయిల్స్ తో వచ్చిన వైబ్రెంట్ పింక్ కార్సెట్ టాప్ ను వేసుకుంది నిక్కీ . దానికి మ్యాచింగ్ గా ఉబెర్-చిక్ రిప్డ్ డెనిమ్ జీన్స్‌ని జోడించింది. సాధారణ ఎంపికలతో స్టైలిష్‌గా కనిపించే అద్భుతమైన అవుట్ ఫిట్ ఇది.

నిక్కీ న్యూడ్ మేకప్‌తో తన లుక్‌ను మరింత గ్లామరస్ గా మార్చుకుంది. తన కర్లీ కురులను లూజుగా వదులుకుని క్యూట్ స్మైల్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ఎలాంటి ఆభరణాలు వేసుకోనున్న ఈ భామ అందం రెట్టింపు అయ్యింది.

2019 లో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ముంబై మోడల్ అయినా తెలుగు సినిమాతోనే వెండి తెరకు పరిచయం అయ్యింది. చీకటి గదిలో చితకొట్టుడు సినిమాలో తన గ్లామర్ షో తో కుర్రాళ్ళకు ఓ రేంజ్ లో చెమటలు పట్టించింది. ఆ తర్వాత కాంచన 3 లోనూ నటించింది. ఆ తర్వాత తిప్పరా మీసం లోనూ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాలు ఈ బ్యూటీ కి పెద్దగా పేరు తెచ్చి పెట్టకపోవడం తో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ బుల్లి తెరలో నటిస్తూ తన గ్లామర్ షో తో హల చల్ చేస్తోంది.

తెర ముందే కాదు తెర వెనకాల కూడా తన గ్లామరస్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
