Nikhil Siddhartha: ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం ఇతని పేరు ఎక్కడ చూసిన మారుమోగుతోంది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా కార్తికేయ 2 సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పాన్ ఇండియా స్టార్ గా 5 వ స్థానం దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఆస్కార్ కు సంబంధించి నిఖిల్ చేసిన వ్యాఖ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారతదేశం నుంచి ఆస్కార్‌కు చెల్లో షో మూవీ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ మూవీ లవర్స్ మాత్రం దీనిపై చాలా అసహనంతో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న RRR సినిమాను కాదని.. అప్పటి వరకూ పేరు కూడా వినబడని సినిమాను పంపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాంగ్ రూట్‌లో చెల్లో షోని ఆస్కార్‌కు పంపారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అటు ఇండస్ట్రీలోని పెద్దలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ యాక్టర్ నిఖిల్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యాలు చేశాడు నిఖిల్. “ఇలా అంటున్నందుకు సారీ. ఈ విషయంలో నా ఒపీనియన్ వేరు. అందరికీ ఆస్కార్ అవార్డ్స్ అంటే ఇష్టమే. కానీ మన సినిమాను ప్రపంచమంతా మెచ్చుకొని అభిమానివ్వడమే సినిమాకు అతి పెద్ద అవార్డ్” అని అన్నాడు. ఈ RRRపై సినిమా అభిమానులు ప్రేమ కురిపించారు. అదే ఆ సినిమా సాధించిన పెద్ద విజయం. అలాంటప్పుడు మనకు ఆస్కార్స్ ఎందుకు? మనకంటూ ప్రత్యేకంగా ఫిల్మ్‌ఫేర్, నేషనల్ అవార్డ్స్ లాంటివి ఉన్నాయి.
Nikhil Siddhartha: ఆస్కార్ అవార్డ్ ను తిరస్కరించిన నిఖిల్..
నేను పర్సనల్‌గా ఆస్కార్స్‌కు ప్రాధాన్యతనివ్వను. అసలు ఆస్కార్స్ నుంచి మనకు సర్టిఫికేట్ అవసరమా? మన సినిమాలు అద్భుతం. ఇండియా సినిమాలు అదరగొడుతున్నాయి. స్పెయిన్‌లో ఉన్నప్పుడు నేను RRR సినిమా చూశాను. థియేటర్ ఫుల్ అయిపోయింది. స్పానిష్ వాళ్లంతా ఆ సినిమాను చూసి మళ్లీ మళ్లీ థియేటర్‌కు వచ్చారు. మనకు ఆస్కార్స్ నుంచి స్పెషల్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదని స్పష్టంగా చెప్పాడు.