మెగా వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన నీహారిక మూవీలతో సినీ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యాంకర్ గా,నిర్మాతగా,వెబ్ సిరిస్ లలో లీడ్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.గతేడాది చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న ఈమె తాజాగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో లో పాల్గొన్నది.ఈ షోలో నీహారిక ప్రస్తుతం తన భర్త తాను వేరు కాపురం పెట్టామని కొన్నిరోజులు ఇలాగే ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చింది.ఇప్పటివరకు నేను సింగిల్ గా ఉన్నదే లేదు.. చిన్నప్పటినుంచి ఇంట్లో నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు.అందుకే ఇప్పుడు ఫ్రీగా ఉండాలనుకుంటున్నా.. అందుకు నా భర్త చాలా సపోర్ట్ గా ఉంటున్నాడని” చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం నెట్టింట ఈ వార్త వైరల్ అవుతుంది.ఈ వార్త విన్న నెటిజన్స్ అంతా కనీసం పెళ్లై ఒక ఏడాది కూడా కాలేదు అప్పుడే వేరు పడడం ఏంటి అని తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.