యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ వైపు సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తూనే మరో వైపు మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ కథాంశంతో తెరకెక్కబోయే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న అందులో మెజారిటీ భాగం ప్రభాస్ రెమ్యునరేషన్ క్రిందనే ఉంది. షూటింగ్ కోసం మాత్రం మారుతి చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాడు. అలాగే షూటింగ్ షెడ్యూల్ కూడా చాలా తక్కువ సమయం పెట్టుకున్నాడు. సినిమా కథ మొత్తం ఒక బిల్డింగ్ నేపధ్యంలోనే ఉంటుందని టాక్. దీనికోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా సెట్ కూడా వేయించారని తెలుస్తుంది.
ఈ నెలలోనే ఈ మూవీ షూటింగ్ ని మారుతి ప్రారంభించబోతున్నారు. ఇక ప్రభాస్ కూడా ఒక వారం రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. ప్రభాస్ లేకుండా ఉన్న సన్నివేశాలని ముందుగా పూర్తి చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నారు. హర్రర్, కామెడీ నేపధ్యంలో సినిమా కథ ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్ ఇప్పటికే ఖరారైంది. అలాగే సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఇక మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
కెరియర్ లో సరైన హిట్ లేకపోయిన ఈ బ్యూటీ ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో పాన్ ఇండియా చిత్రాలలో నటించే అవకాశం రావడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో యువరాణి పాత్రలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఆమె పాత్రకి సంబందించిన లుక్ కూడా రివీల్ అయ్యింది. ఆ సినిమాపై నిధి చాలా హోప్స్ పెట్టుకుంది. ఇక ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైన ఉండగానే ఇప్పుడు ప్రభాస్ కి జోడీగా మారుతి సినిమాలో నటించే ఛాన్స్ రావడం నిజంగా అదృష్టం అని చెప్పాలి.