Allu Arjun : పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్. అసలే మనోడికి టాలీవుడ్‌ను మించి ఇతర ఇండస్ట్రీలలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేరళ, బెంగుళూరులలో విపరీతంగా అభిమానులున్నారు. అందుకే మనోడిని అక్కడి వాళ్లు మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం లభించింది. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు ఆయన నాయకత్వం వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ ర్యాలీని నిర్వహించింది.దీనికి గ్రాండ్ మార్షల్‌గా అల్లు అర్జున్ వ్యవహరించారు.
యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో బన్నీ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి హాజరవడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. దాదాపుగా ఈ పరేడ్ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత స్థాయిలో ‘న్యూయర్క్ డే పరేడ్’ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ‘ఇండియా డే పరేడ్’ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘యే భారత్‌కా తిరంగా హై.. కబీ ఝుకేగా నహీ..తగ్గేదేలే’.. అంటూ పుష్ప డైలాగ్‌తో ఉత్సాహపరిచాడు.
Allu Arjun : అల్లు అర్జున్ రాకతో కిక్కిరిసిన న్యూయర్క్ వీధులు..
అలానే న్యూయార్క్ సందర్శనలో భాగంగా న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు. వారి సంభాషణల మధ్యలోఎరిక్ ఆడమ్ చేత ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన ‘పుష్ప’ చిత్రంలోని ‘తగ్గేదేలే’.. అనే డైలాగ్‌ను చెప్పించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక గ్రాండ్ మార్షల్‌గా వ్యవహిరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి అక్కడి మేయర్ ఆడమ్స్ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నిషన్ బహుకరించారు. ఇండియా పరేడ్‌కి అల్లు అర్జున్ రావడంతో న్యూయర్క్ వీధులు కిక్కిరిసిపోయాయి. అసోసియేషన్ ఛైర్మన్ అంకుర్ వైద్య సహా వివిధ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రవాస భారతీయులు ర్యాలీలో పాల్గొన్నారు.