Bigboss 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ 4 నుంచి ఆరో సీజన్ ప్రారంభం అవుతుండటంతో నిర్వాహకులు బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ల ఎంపిక సైతం పూర్తైంది. వారితో అగ్రిమెంట్స్ కూడా జరిగిపోయాయి. ఒకటి రెండు రోజుల్లోనే వారిని క్వారెంటైన్‌కి కూడా పంపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే బిగ్‌బాస్ సీజన్ 6కి సంబంధించిన ప్రారంభోత్స ఎపిసోడ్ కోసం సెట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కంటెస్టెంట్స్ సైతం ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నారని సమాచారం.
తాజాగా కొత్త కంటెస్టెంట్ పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తరుణంలో విశాల్ రాజ్ అనే ప్రముఖ మోడల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్టు సమాచారం. అతను ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీల యాడ్స్‌లో నటించాడు. ఆరడుగుల ఎత్తుతో మాంచి ఫిజిక్.. పైగా బాడీ బిల్డర్ అవడంతో విశాల్‌కు హౌస్‌లో మంచి క్రేజ్ ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇతని ప్రెజెన్స్ వల్ల షో కి ఎలాంటి కిక్ వస్తుందో వేచి చూడాలి. ఇక ఫైనల్ లిస్ట్‌లో విశాల్ ఉంటాడో లేదో వేచి చూడాలి. అయితే నిజంగా అతను షోలో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Bigboss 6 : ప్రారంభ ఎపిసోడ్ ఆధారంగానే అంచనాలు..
బిగ్‌బాస్ గ్రాండ్ ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో రేటింగ్‌ను తీసుకొచ్చే దిశగా స్టార్ మా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని టాక్. ప్రారంభోత్సవ ఎపిసోడ్ ఆధారంగానే మొత్తం సీజన్‌ను కొందరు అంచనా వేస్తారు. కంటెస్టెంట్స్ బాగా తెలిసిన వారైతే ఆ షోకి రేటింగ్ దుమ్ము దులుపుతోంది. అందుకే అన్ని విధాలుగా అద్భుతంగా ఉంది అన్నట్లుగా టాక్ రావడం కోసం అభిమానులను అలరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. కనుక వారికి సంబంధించిన ఏవీ చిత్రీకరణలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రారంభోత్సవ ఎపిసోడ్ హడావుడి ఇప్పటికే మొదలైందని టాక్.