Samantha : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. ఒక్కోసారి పాత వీడియోలు సైతం సరికొత్తగా వైరల్ అవుతుంటాయి. స్టార్ హీరోయిన్ సమంత విషయంలోనూ అదే జరిగింది. అప్పుడెప్పుడో సామ్.. ప్రధాని మోదీ గురించి చేసిన కామెంట్స్ తిరిగి మరోమారు వైరల్ అవుతున్నాయి. తాజాగా మోదీపై చేసిన కామెంట్స్‌కు తోడుగా.. పాత వీడియోను సైతం తిరగదోడి మరీ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున అమ్మడిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మోదీని ప్రశంసించడంపై భగ్గుమంటున్నారు. బీజేపీ, మోదీపై చేసిన ఓల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్‌గా ఓ ఇంటర్య్వూలో సామ్ బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే తన మద్దతు అని కామెంట్స్ చేశారు. దీంతో గతంలో కూడా సమంత మోదీపై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను కూడా వైరల్ చేస్తూ ఆమెపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఓ వీడియోలో సామ్ మాట్లాడుతూ.. ‘నేను ఎల్లప్పుడు మోదీజీ సపోర్టర్‌నే. ఆయన చేసే మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నా’ అని వ్యాఖ్యానించారు.ఇక మరో వీడియోలో.. ‘నేను మోదీ సపోర్టర్. ఎందుకంటే ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నా. ఆయన దేశాన్ని ముందుకు నడిపిస్తారు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువస్తారు’ అని చెప్పుకొచ్చింది.
Samantha : బీజేపీ నేతల దృష్టిలో పడేందుకేనా?
అయితే మోదీ ప్రస్తుతం నిర్ణయాల నేపథ్యంలో ఆమె పాత కామెంట్స్‌ను నెటిజన్లు వైరల్ చేస్తూ సామ్‌కు చురకలు అట్టిస్తున్నారు. ‘ఎల్పీజీ సిలిండర్ 1100 రూపాయలు అయింది. ఆర్థిక వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా?’ అంటూ సామ్‌పై ఫైర్ అవుతున్నారు.మోదీ పథకాలు, నిర్ణయాలపై తీవ్ర అసహనంతో ఉన్న నెటిజన్లు.. సామ్ కామెంట్స్‌పై మండిపడుతున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేతలు సినీ యాక్టర్లను కలుస్తున్న విషయం తెలిసిందే. వారి దృష్టిలో పడేందుకే సామ్ ఇలాంటి కామెంట్స్ చేస్తుందని సైతం మండిపడుతున్నారు. మొత్తానికి అమ్మడు రాజకీయాల్లో సైతం అడుగు పెట్టాలని ఆరాటపడుతోందంటూ ట్రోల్ చేస్తున్నారు.