టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ రష్మిక మందన. ఈ అమ్మడు ప్రస్తుతం వారసుడు సినిమాతో పాటు పుష్ప2లో నటిస్తుంది. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. మరో వైపు ఎన్ఠీఆర్ పాన్ ఇండియా మూవీ కోసం కూడా రష్మికని సంప్రదిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. రెమ్యునరేషన్ విషయంలో ఇంకా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు ఎవరైనా మోడీ జపం చేసిన, ఆయన్ని పొగిడిన, లేదంటే మోడీ చేస్తున్న కార్యక్రమాలని ప్రమోట్ చేసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
వారి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆ మధ్య మోడీ విజన్ ని ప్రశంసించినందుకు సమంతపై ట్విట్టర్ లో నెటిజన్లు విమర్శలు చేశారు. మోడీ విధానాలు తెలియకుండా కామెంట్స్ చేయొద్దు అంటూ ఆమెకి ఉచిత సలహాలు ఇచ్చారు. ఇక తాజాగా రష్మిక మందన సెప్టెంబర్ 17న దేశ వ్యాప్తంగా గా జరగబోయే మెగా బ్లడ్ డొనేషన్ క్యాప్ ని విజయవంతం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాలలో వీలైనంత ఎక్కువ మంది పాల్గొనాలని ఓ పోస్టర్ తో మోడీ సందేశాన్ని ఇచ్చారు.
రష్మిక మందన దీనిని రీట్వీట్ చేసి ఇలాంటి అద్భుతమైన, బాధ్యతాయుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా అభ్యర్ధిస్తున్నట్లు పోస్ట్ చేసింది. అయితే ఇలా మోడీ చేస్తున్న ఈ క్యాంపైన్ ని ప్రమోట్ చేయడం బీజేపీ, నరేంద్ర మోడీ వ్యతిరేకులకి నచ్చలేదు. కార్యక్రమం మంచిది అయిన రష్మిక మందన ఇలా వారిని ప్రమోట్ చేయడంపై కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ట్వీట్ నుంచి మోడీ బొమ్మని తొలగించాలని కొంతమంది వార్న్ చేస్తే మరికొంత మంది మోడీని మీరెలా ప్రమోట్ చేస్తారని, అతని విధానాలు అన్ని కూడా ప్రమాదకరంగా ఉంటాయని కామెంట్స్ చేయడం విశేషం.