యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఏకంగా చేతిలో ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో 2000 కోట్లకి పెట్టుబడులు నిర్మాతలు అతని పెద్ద పెట్టారంటే ప్రభాస్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఆదిపురుష్ సినిమా బిజినెస్ ఇప్పటికే వెయ్యి కోట్లకి పైగా జరిగింది అంటే దానికి కారణం ప్రభాస్ కి ఇండియన్ వైడ్ గా ఉన్న ఫాలోయింగ్ అని చెప్పాలి. అలాగే సలార్ సినిమాకి కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇలాంటి నటుడిగా ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన కచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి.
అయితే నెట్ ఫ్లిక్స్ ఈ విషయంలో కాస్తా షో చేసింది. నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా పేజీలో సాహో సినిమాకి సంబందించిన ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ స్టిల్స్ ని షేర్ చేసి వాటి మీద ట్రోలింగ్ చేసింది. వీటిని కూడా యాక్షన్ సీన్స్ అంటారా అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పోస్టులు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక్కసారిగా కోపం వచ్చింది. దీంతో నెట్ ఫ్లిక్స్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. బ్యాన్ నెట్ ఫ్లిక్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు.
మా సినిమాలతో డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ మా హీరోలని అవమానించే విధంగా మీమ్స్ పెడతారా అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ పై చేసిన ఈ ట్రోలింగ్ పోస్ట్ పై నెట్ ఫ్లిక్స్ ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో అమెజాన్ ప్రైమ్ ని కూడా ఇలాంటి విషయంలోనే సోషల్ మీడియాలో బ్యాన్ చేయాలంటూ ట్రోల్ చేశారు. దానికి అమెజాన్ ప్రైమ్ దిగివచ్చి క్షమాపణలు చెప్పింది. అయితే ఇప్పుడు ప్రభాస్ ని అవమానించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.