Neha Shetty: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ తనయుడు ఆకాష్ నటించిన మెహబూబా తో తెలుగు సినీ ఇండస్ట్రీకీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. కానీ మెహబూబా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికి అందులో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ గ్లామర్ కు, నటనకు మంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు.
ఈ సినిమా తర్వాత ఆమె గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో లభించినప్పటికీ ఆశించిన విధంగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా హీరోయిన్ నేహా శెట్టి కి కూడా మంచి పేరును తెచ్చి పెట్టింది. ఈ సినిమా మంచి హిట్ అవడంతో నేహా శెట్టి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించి మెప్పించింది నేహా.
ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ముద్దుగుమ్మ పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది అని సమాచారం. ఇక డీజే టిల్లు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపించడంతోపాటు తన గ్లామర్ డోర్స్ ని మరింత పెంచేసింది.
సెగలు పుట్టించే తన అందంతో యువతకి నిద్ర పట్టకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంది. లండన్ లోని వీధుల్లో విహరిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. కాగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.