Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ నేహా చౌదరి అద్భుతమైన ఆట తీరుతో రాణిస్తూ ఉంది. రెండు ఫిజికల్ టాస్కులు గెలిచి క్లాస్ గ్రూప్ లోకి వెళ్లి మొదటి వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకుంది. ఇంకా సంభాషణ విషయంలో సైతం కరెక్ట్ పాయింట్ లు మాట్లాడుతూ.. తోటి కంటెస్టెంట్లకు మంచి పోటీ ఇస్తుంది. కెప్టెన్సీ టాస్క్ లో రూల్స్ బ్రేక్ చేసి.. కొద్దిగా నెగటివ్ అయినా గాని నేహా చౌదరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మొదటి వారం ఆట తీరు బట్టి చాలామంది చెబుతున్నారు.

ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ ఫస్ట్ వీకెండ్ నేపథ్యంలో.. నేహా చౌదరికి బిగ్ బాస్ షో నిర్వాహకులు సర్ప్రైజ్ ప్లాన్ చేయడం జరిగిందంట. మేటర్ లోకి వెళ్తే నేహా చౌదరి పుట్టినరోజు సెప్టెంబర్ 11వ తారీకు కావటంతో ఆమె పుట్టినరోజు వేడుకలు హౌస్ లో చాలా ఘనంగా నిర్వహించారట. అంతేకాదు ఈ క్రమంలో నేహా చౌదరి బ్రదర్ నీ హౌస్ లోకి షో నిర్వాహకులు పంపించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రీతిగా నేహా చౌదరికి పుట్టినరోజు నాడు బిగ్ బాస్ టీం సర్ప్రైజ్ ఇచ్చినట్లు సమాచారం.

గత సీజన్ లలో బిగ్ బాస్ బర్తడే నేపథ్యంలో కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు చేసినా గాని కంటెస్టెంట్ ల ఇంటి సభ్యులను ఎవరిని హౌస్ లోకి పంపించలేదు. కానీ ఫస్ట్ టైం సీజన్ సిక్స్ లో బర్తడే జరుపుకుంటున్న కంటెస్టెంట్ ల యొక్క కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపిస్తున్నట్లు సోషల్ మీడియాలో శనివారం ఎపిసోడ్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.