నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమాని గోపిచంద్ తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా కనిపించబోతుంది. రవితేజ తో క్రాక్ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత గోపీచంద్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా చేయబోతున్న సంగతి తెలిసందే.
ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక దిల్ రాజు, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక దీనిని కూడా గోపిచంద్ తన శైలిలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నట్లు వినికిడి, మరల ముద్దుల మామయ్య, బంగారు బుల్లోడు సినిమాలలో ఉన్న బాలయ్యని తన సినిమా కోసం అనిల్ రావిపూడి చూపించబోతున్నట్లు తెలుస్తుంది. తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాలయ్య కెరియర్ లో అత్యధిక బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇప్పటి వరకు అనుకున్న ప్రకారం అయితే 80 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా. అనిల్ రావిపూడి కెరియర్ లో కూడా ఇదే అత్యధిక బడ్జెట్ కావడం విశేషం. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడానికి అనిల్ రావిపూడి ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక సినిమాలో బిందు మాధవి కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె చేయబోయేది ఎలాంటి పాత్ర అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.