Nayanatara: ప్రముఖ నటి నయనతార తన చిరకాల ప్రేమికుడు విఘ్నేష్ శివన్‌ను రీసెంట్‌గా పెళ్లి చేసుకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ జంట సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయితే వాళ్లిద్దరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే ఇప్పుడు వీరికి కష్టాలు తీసుకువచ్చింది. సరోగసీ విదానం ద్వారా గర్భం దాల్చడం వీరికి ఇప్పుడు న్యాయపరమైన చిక్కులను తీసుకువచ్చింది. ఈ విషయాన్ని విచారించడానికి తమిళనాడు ప్రభుత్వం ఓ త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. వారం రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నయన్, విఘ్నేష్‌లను విచారించనున్నారు.
సరోగసీకి స్నేహితురాలి సాయం అయితే నయన్‌కు సరోగసి విధానంలో అద్దె గర్భం అందించిందెవరనే విషయంపై ఇప్పుడు లోతైన విచారణ జరుగుతోంది. కేరళాకు చెందిన ఓ మహిళ సరోగసీ ద్వారి బిడ్డలను కని.. నయనతారకు అప్పగించిందని విచారణలో తేలింది. ఆమె నయనతారకు స్నేహితురాలు కావడం కొసమెరుపు. కేరళలో తనతోపాటు చదువుకున్న స్నేహితురాలితి సాయంతోనే నయన్ కవల పిల్లలకు జన్మనిచ్చిందని విచారణ తేలినట్లు తెలుస్తోంది. అయితే ఈ సరోగసి విధానినికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వకుండా నయనతార పిల్లలను పొందిందనేది ఇప్పుడు ప్రధాన ఆరోపణ.
Nayanatara: లాయర్లతో మంతనాలు..
ఇప్పటివరకు ఈ విషయంపై అటు నయన్‌గాని, విఘ్నేష్‌గాని ఎటువంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. కాని ప్రభుత్వం మాత్రం అసలు ఈ సరోగసి విధానం రూల్స్ ప్రాకరం జరిగిందా లేదా అనే విషయాన్ని నెగ్గు తేల్చాలని చూస్తుంది. ఒకవేళ నయన్ రూల్స్‌కి వ్యతిరేకంగా పిల్లలను పొందినట్లు తేలితే ఆమెకు పది సంవత్సరాల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అందుకే నయన్ ఇప్పుడు ఈ విషయమై లాయర్లను సంప్రదిస్తుందంట. ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడాలని వారితో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్లు భోగట్టా.
అసలు జూన్ 9న పెళ్లి అయితే ఇంత తొందరగా పిల్లలు ఎలా పుట్టారనే విషయం మొదట్లో ఎవ్వరికీ అంతుచిక్కలేదు. ఆ తరువాత సరోగసీ పద్ధతి ద్వారా తల్లిదండ్రులైనట్లు క్లారిటీ లభించింది. పెళ్లైన వెంటనే మాల్దీవులకు నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ ట్రిప్ కూడా వెళ్లారు. ఆ తరువాత ఆమె హిందీలో షారూఖ్‌ఖాన్ సరసన నటిస్తున్న జవాన్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ తరువాత కూడా మీడియా ముందుకు పలుమార్లు వచ్చారు. మధ్యలో మెగాస్టార్ చిరంజీవితో గాధ్‌పాధర్ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇంత బిజీ షెడ్యూల్ ఎప్పుడూ ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం కూడా ఎవరికీ తెలియలేదు. పెళ్లికి ముందే సరోగసీ విధానంతో పిల్లలను పొందవచ్చని వీరిద్దరూ ప్లాన్ చేసుకున్నట్లు తాజాగా తెలుస్తుంది. ఈ పద్ధతిలో ఇప్పటికే అమీర్‌ఖాన్, మంచు లక్ష్మీ వంటి సెలబ్రెటీలు పిల్లల్ని కన్నారు.