Nayanatara : సౌత్ బ్యూటీ నయన తర తన సినీ కెరీర్ లో అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్డమ్ ను సంపాదించుకుంది. ఒకప్పుడు నటనే రాదు అని విమర్షలపాలైన నయన్ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ స్థాయికి చేరుకుంది. చేసే ప్రతి సినిమాలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ నయనతారలో పుష్కలంగా ఉంది. అదే ఆమెను ఈ స్థాయికి చేర్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొంత కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా తెరముందు చూపిస్తోంది. ఇంచుమించు నయన్ ఇండస్ట్రీకి వచ్చి 18 నుంచి 19 ఏళ్లు అవుతోంది. ఈ రెండు దశాబ్దాల్లో సుమారు 80 సినిమాల వరకు ఆమె నటించింది. అయితే రీసెంట్ గా చేసిన ఓ ఇంటర్వ్యూలో నయన్ తన కెరీర్ గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగడం అంత ఈజీ కాదు అని నయన్ చెప్పుకొచ్చింది. మంచి , చెడు రెండింటిని చూశానని ఇప్పుడంతా బాగుందని తెలిపింది. నయన్ తన కెరీర్ విషయాలను ఇన్నేళ్ల తరువాత పంచుకుంటుండటంతో అభిమానులు ఆమె మాటలకు ఇంప్రెస్ అవుతున్నారు.

నయనతార 2003లో మనసునక్కరే అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేసింది. కొన్నేళ్లుగా, ఆమె తమిళంలో అయ్య , తెలుగులో లక్ష్మి , కన్నడతో సూపర్ వంటి చిత్రాలతో పలు పరిశ్రమలలోకి ప్రవేశించింది. శ్రీ రామరాజ్యం, చంద్రముఖి, గజిని, రాజా రాణి, అరమ్, ఇరుముగన్, నేత్రికణ్ వంటి చిత్రాలలో ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
న్యూస్ ఏజెన్సీ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నయనతార మాట్లాడుతూ, ఇన్నేళ్లు నేను ఇండస్ట్రీ నుంచి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి అని తెలిపింది. నేను చేసిన తప్పులు, మంచి , నాకు ఎదురైన చెడు అనుభవాలు ఉన్నాయంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది అని చిరునవ్వుతో తెలిపింది. 18-19 సంవత్సరాలు సినీ పరిశ్రమలో ఉండటం అంత సులభం కాదు, కానీ ప్రేక్షకులు ,దేవుడు నా పట్ల దయ చూపారు అని పేర్కొంది. ఇది నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను అని తెలిపింది.

నయనతార ,ఆమె భర్త చిత్ర నిర్మాత విఘ్నేష్ శివన్ 2021లో తమ ప్రొడక్షన్ బ్యానర్ రౌడీ పిక్చర్స్‌ని ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్‌లో కూజంగల్, నేత్రికన్, కాతువాకుల రెండు కాదల్ వంటి చిత్రాలకు రూపొందించారు. వీటికి విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. సినిమా నిర్మించినా, కొన్నా, నేను సినిమాలో నటించినా మంచి సినిమాలు తీయడం, తీసుకురావడం ఒక్కటే నా పని అని తెలిపింది. మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకదానిని అని తెలిపింది. మీరు మీ పని పట్ల నిజాయితీగా ఉంటే, మీరు మీ పనిని బాగా చేస్తే, అది కచ్చితంగా ఫలితాన్ని అందిస్తుందని చెబుతోంది. అప్పుడే ప్రేక్షకులు మీతో కనెక్ట్ అయ్యి, వారు మీతో ప్రేమలో పడతారని అదే మీ జీవితంలో అతిపెద్ద ఆనందంగా మారుతుంది అని ఆమె జోడించింది. నయనతార నటించిన తమిళ హారర్ మూవీ కనెక్ట్ విడుదలై సోసోగా ఆడుతున్నా నయన్ ఆనందంగానే ఉంది. మంచి సినిమా తీశామన్న సంతృప్తి ఉందని తెలిపింది.

ఇక నయనతార ఈ సంవత్సరం చిత్రనిర్మాత అట్లీ రూపొందించే జవాన్‌తో హిందీలోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కూడా నటిస్తున్నారు. షారూఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ దీనిని నిర్మిస్తోంది. జవాన్ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలకానుంది. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం కన్నడ భాషల్లో జూన్ 2న థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Advertisement