Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి నయనతార గురించి పరిచయం అవసరం లేదు.ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయన తారకు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా తెలుగు తమిళ భాషలలో గత రెండు దశాబ్దాల నుంచి అగ్రతారగా కొనసాగుతూ దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే అందరికన్నా అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా పేరుపొందారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె గత కొంతకాలం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ఈ ఏడాది జూన్ 9వ తేదీ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇలా నయనతార పెళ్లి ఫిక్స్ అవ్వగానే ఇక ఈమె సినిమాలలో నటించరంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు. ఈ విధంగా నయనతార సినిమాలకు దూరమవుతారని తెలియడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందారు.
వివాహం తర్వాత ఈమె తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా పెళ్ళికి ముందే కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా తర్వాత నయనతార ఎలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.ఇక ప్రస్తుతం తన భర్తతో కలిసి విదేశాలలో హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నయనతారకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జవాన్ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈమె ఏ సినిమాలకు కమిట్ అవ్వలేదని ఇక పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Nayanatara: వ్యాపార వేత్తగా మారిబోతున్న నయనతార…
ఇప్పటివరకు సినిమాలలో సంపాదించిన డబ్బును ఈమె వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ పూర్తిగా వ్యాపారవేత్తగా మారిపోతున్నారని తెలుస్తుంది.మరి నయనతార గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ఈమె సినిమాలకు దూరమవుతున్నారనే వార్త తెలియడంతో అభిమానుల సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల పై క్లారిటీ రావాలంటే ఈ విషయంపై నయనతార స్పందించి అసలు విషయం తెలియజేయాల్సి ఉంది.