సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా ఉంది. అక్కడ లేడీ సూపర్ స్టార్ గా సోలో హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ లు అందుకుంటుంది. ఆమెతో సినిమా అంటే నిర్మాతలు కూడా రెడీ అవుతున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలకి చేరువ అవుతున్న నయనతార ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఈ బ్యూటీ కొనసాగుతుంది. తెలుగులో కూడా కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ హీరోలు అందరితో నయనతార ఆడిపాడింది. అయితే తెలుగు కంటే ఆమె ప్రాధాన్యత తమిళ సినిమాల పైనే ఉంటుంది. అందుకే తెలుగులో అగ్ర హీరోల సరసన సినిమాలు చేస్తున్నా ప్రమోషన్స్ కి మాత్రం రాదు.
చాలా కాలంగా సినిమా ప్రమోషన్స్ కి నయనతార దూరంగా ఉంటూనే వస్తుంది. ఇదిలా ఉంటే నయనతార తెలుగులో అందరికంటే ఎక్కువగా నందమూరి బాలకృష్ణతో సినిమాలు చేసింది. శ్రీరామరాజ్యం, సింహ, జై సింహ సినిమాలలో నయనతార బాలకృష్ణతో జత కట్టింది. ఈ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ ని మంచి క్రేజ్ తెలుగులో ఉంది. బాలకృష్ణకి నయనతార పెర్ఫెక్ట్ జోడీ అని భావిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యతో నెక్స్ట్ చేయబోటీయే సినిమా కోసం నయనతారని హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు.
అయితే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 8 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు అదనంగా చాలా ఖర్చులు అడిగిందని టాక్ వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ముందుగా నయనతారని దిల్ రాజు, అనిల్ ఖరారు చేసుకున్న మారిన కొత్త నిబంధనలతో ఆమె వర్క్ అవుట్ కాదని భావించినట్లు తెలుస్తుంది. దీంతో ఆ విషయాలని అనిల్ రావిపూడి ఆమెకి చెప్పడంతో నయనతార చేయనని చెప్పేసినట్లు టాక్. ఈ నేపధ్యంలో అనిల్ బాలయ్య కోసం మరో హీరోయిన్ ని వెతికే పనిలో ఇప్పుడు ఉన్నాడని సమాచారం.