Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.2003లో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నారు.గత ఏడు సంవత్సరాల నుంచి ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉంటూ ఈ ఏడాది అతనిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహమైన అనంతరం ఈ జంట పలు విదేశీ పర్యటనలకు వెళ్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వివాహమైన తర్వాత కూడా ఈమె తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా కోసం ఈమె పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.
నయనతార ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక్కొక్క బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం ఈమె ఏకంగా ఐదు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ నయనతార భారీగా సంపాదించారని తెలుస్తోంది.
Nayanatara: వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన నయన్
ఇలా ఈమె సినిమాలలో సంపాదించిన డబ్బుతో చెన్నై తో పాటు హైదరాబాదులో కూడా కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులను కొనుగోలు చేశారు. ఇలా కోట్ల విలువచేసే ఆస్తులతో పాటు ఖరీదైన కార్లు ప్రైవేట్ జెట్ విమానం వంటి వాటిని కొనుగోలు చేశారు.ఇక నయనతార గత రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఆస్తులను సంపాదించినట్టు తెలుస్తోంది.ఇక ఈమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు అలాగే పలు వ్యాపారాలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో కూడా ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.