Nayanatara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సింది ఏమీ లేదు. సినిమాలతో పాటు తన వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంది. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ అదరగొడుతోంది. మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ అంటూ తన నట జీవితాన్ని అందమైన ప్రయా ణంగా మార్చుకున్న నయనతార ఇటీవలే బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. గ్లామరస్ పాత్రలతో కెరీర్‌ను ప్రారంభించి.. అన్ని పాత్రల్లోనూన నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ లేడీ సూపర్ స్టార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.
తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న నయన్.. ఇక మీదట నటనకు స్వస్తి చెప్పనుందట. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి అయిన నయన్.. ఇకపై నటించదని సోషల్ మీడియా టాక్. ఇప్పటికే అమ్మడు తన సంపాదించిందంతా బిజినెస్‌లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగా రాణిస్తోంది. ప్రస్తుతం భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి విదేశాల్లో నయన్ ఎంజాయ్ చేస్తోంది. అయితే అమ్మడు త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే అభిమానులను కలతకు గురి చేస్తోంది.
Nayanatara : మంచి చిత్రాలను వెండితెరకు అందించాలనుకుంటోందట..
ఆమె నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా రాణిస్తుందట. మంచి చిత్రాలను వెండితెరకు అందించాలని నయన్ ఉవ్విళ్లూరుతోందట. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే.. నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కెరీర్ ఇంత పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నయన్ నటనకు గుడ్ బై చెబుతుందంటే నమ్మశక్యంగా లేదు. పైగా అమ్మడు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనేది లేదని తెగేసి చెబుతున్నా.. దర్శకనిర్మాతలు మాత్రం నయన్‌నే ఎంచుకుంటున్నారు. నయన్‌కు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నప్పుడు నటనకు గుడ్ బై చెబుతుందా? ఏమో వేచి చూడాలి. “