Navya Swamy: నవ్య స్వామి.. తెలుగు బుల్లితెర పేక్షకులకు ఈమె బాగా సుపరిచితమే. నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవ్య స్వామి ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ తమిళ సీరియల్స్ లో కూడా నటించి నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది.
ఈమె తెలుగులో నా పేరు మీనాక్షి, ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి లాంటి సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈమె ఆమె కథ సీరియల్ లో నటించినప్పుడు అందులో హీరోగా నటించిన రవి కృష్ణ తో ప్రేమలో పడింది అంటూ వార్తలు వినిపించాయి.
అంతేకాకుండా వీరిద్దరూ ఇక్కడికి వెళ్లినా కూడా కలిసి వెళ్లడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూరినట్టు అయింది. అలాగే పలు ఈవెంట్లలో కూడా వీళ్ళిద్దరూ కలిసి డాన్సులు చేశారు. ఇమేజ్ తన అందం నటనతో రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అంతేకాకుండా వెండితెరపై పలు సినిమాలలో కూడా నటించింది. ఇక కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో యువతని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈ మధ్యకాలంలో మితిమీరిన అందాల ప్రదర్శన చేస్తూ తన ఫాలోవర్ల సంఖ్య అంతకంతకు పెంచుకుంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా నవ్య స్వామి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో ఎక్కడికో జర్నీ చేస్తున్న నవ్య స్వామి ఒక విండో పక్కన కూర్చుని నవ్వుతూ ఫోటోకి ఫోజులు ఇచ్చింది..అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.