Navratri: నవరాత్రి సమీపిస్తోంది.. దీంతో దేశవ్యాప్తంగా నవరాత్రి సంబరాలకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే నవరాత్రుల్లో అమ్మ వారిని పూజించడం, కొన్ని నియమాలను పాటించడం తెలిసిందే. నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు స్వీయ-నియంత్రణను పాటించే ఉద్దేశంతోనే కొన్ని ప్రత్యేకమైన నియమాలను పెట్టుకుంటూ ఉంటారు.
నవరాత్రి వేళ ఎలాంటి నియమాలను పాటించాలో ఇక్కడ తెలుసుకోండి:
నవరాత్రి వేళ ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. నవరాత్రుల తొమ్మిది రోజులు రోజులో కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలి.
నవరాత్రి వేడుకలను తొమ్మిది రూపాల్లో పూజిస్తాము. స్త్రీ శక్తిని గౌరవించే, పూజించే సంస్కృతి మనది. నవరాత్రుల నుండి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని నేర్చుకోవాలి.
చాలామంది అమ్మ వారికి అఖండ జ్యోతిని వెలిగిస్తుంటారు. అయితే ఈ అఖండ జ్యోతిని నైరుతి దిశలో ఉంచాలి. అఖండ జ్యోతిని పెట్టలేని వారు రాత్రిపూట కూడా వెలిగేలా ఒక దీపాన్ని వెలిగించాలి.
నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉండేవారు సాధారణంగా శుద్ధి చేసిన ఉప్పు కాకుండా లవణం ( రాక్ సాల్ట్) వాడాలి.
నవరాత్రి వేళ ఉపవాసం పాటించే వారు మద్యం, పొగాకు జోలికి వెళ్లకూడదు.
నవరాత్రులు అయ్యేంత వరకు ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను వాడకూడదు.
Navratri:
కాగా ఈ సంవత్సరం శరద్ నవరాత్రులు సెప్టెంబర్ 26నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 5వ తేదీన విజయ దశమి, దుర్గా విసర్జనతో నవరాత్రులు ముగుస్తాయి.