Naveen Polishetty: ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో నవీన్ పోలిశెట్టి ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ అనంతరం హీరోగా అవకాశాలు అందుకున్నారు.
ఈయన హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జాతి రత్నాలు.కరోనా వంటి విపత్కర సమయంలో ఈ సినిమా థియేటర్లో విడుదల ఎన్నో సినిమాలకు ధైర్యం నింపింది అని చెప్పాలి. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం కావడమే కాకుండా ఈ సినిమాకి ఏకంగా సైమా అవార్డు రావడం విశేషం. ఈ సినిమాలో నటించినందుకు గాను ఈయన ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు.
సైమా అవార్డు అందుకున్న సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చిన్నప్పుడు హీరో కావాలని కలలు కనడానికి మనం గొప్ప వాళ్లు కాదని చాలామంది అనేవారు. అయితే ఈ రోజు అదే అబ్బాయి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. కానీ నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని ఎన్నో కన్నీటి కష్టాలను అనుభవించానని ఈయన తెలిపారు.అయితే ఈ కష్టాలు అన్నింటిని ఎదుర్కున్నప్పుడే మనం కన్న కలలు నిజమవుతాయి అంటూ ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి తెలియజేశారు.
Naveen Polishetty: కమిట్ మెంట్..డెడికేషన్..డిసిప్లెన్ ముఖ్యం..
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లకు ఈ విధమైనటువంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ జర్నీలో మనల్ని ప్రోత్సహించే వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలమని తెలిపారు ఇక ఇండస్ట్రీలోకి వచ్చి యువత ఎప్పటికీ కమిట్ మెంట్..డెడికేషన్..డిసిప్లెన్ అనేది ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు చెబుతుంటారు. ఇలా ఉన్నవారు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని చిరంజీవి గారు ఎప్పుడు చెప్పేవారు అంటూ ఈయన ఆయన మాటలను కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.