Nara Lokesh: ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకోగా.. ప్రతిపక్ష టీడీపీ అధికార పక్షాన్ని పలు అంశాల మీద నిలదీస్తోంది. ఏపీలో అరాచక పాలన సాగుతోందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వల్ల ఐఏఎస్ లు జైలు పాలయ్యారని.. ఇప్పుడు జగన్ వల్ల ఐఏఎస్ లే కాదు, ఐపీఎస్ లు కూడా జైలు పాలుకాబోతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొంతమంది అధికారులు జగన్ ట్రాప్ లో పడ్డారని, తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ కెరీర్ ని నాశనం చేసుకుంటున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద కోర్టులు కూడా చాలాసార్లు మొట్టికాయలు వేశాయని, అయినా కూడా జగన్ సర్కార్ కు బుద్ధిరావడం లేదని అన్నారు. 41ఏ ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబును అరెస్ట్ సీఐడీ కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని తన పోస్టులో నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh :
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పని చేసిన ఐఏఎస్ అధికారి లక్ష్మి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా, లక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు జైలు శిక్ష అనుభవిస్తుండగా.. గతంలో సీఎంగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినందుకే తాను అలా చేసినట్లు చెప్పడం తెలిసిందే.