ఏపీలో టీడీపీని లక్ష్యంగా చేసుకొని వైసీపీ మరో కొత్త వ్యూహానికి తెర తీసిందా అంటే అవుననే మాట టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తుంది. జనవరి నుంచి జరగబోయేది చూస్తారు అని గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు, లోకేష్ కి ఇచ్చిన వార్నింగ్స్ ని వారు కోట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు కందుకూరు, గుంటూరు పర్యటనలలో జరిగిన తొక్కిసలాట, ప్రజల మరణాలు వెనుక వైసీపీ కుట్ర ఉందనే కోణాన్ని బయటకి ప్రాజెక్ట్ చేస్తున్నారు.
ముందుగా సహజ మరణాలుగానే తేదేపేఎ భావించిన అధికార వైసీపీ తమపై దాడి చేయడం, ఆ మరణాలకి చంద్రబాబుని కారకుడు అంటూ బూచిగా చూపిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళడం వైసీపీ నాయకులు అందరూ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మూకుమ్మడిగా ఈ దాడి చేయడంతో సైలెంట్ గా ఉంటే కచ్చితంగా తమ నిర్లక్ష్యం కారణంగానే ఆ తొక్కిసలాట ఘటనలు జరిగాయని ప్రజలు నమ్మే అవకాశం ఉంది.
ఈ నేపధ్యంలో ఈ తొక్కిసలాట ఘటనలపై టీడీపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. వారం రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడం, అది కూడా చంద్రబాబు పాల్గొన్న సభలోనే జరగడం టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీని ప్రజలకి దూరం చేసే ఉద్దేశ్యంలో భాగంగానే వైసీపీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్లాన్ వర్క్ అవుట్ చేసి ప్రజల ప్రాణాలని బలిచేయాలని కంకణం కట్టుకుందని నారా లోకేష్ విమర్శించారు. గెలవడం కోసం బాబాయ్ కి గొడ్డలి పోటు వేసిన మీకు ప్రజల ప్రాణాలు తీయడం పెద్ద లెక్క కాదు. 40 ఏళ్ళలో చంద్రబాబు సభలలో ఎప్పుడూ జరగని తొక్కిసలాట ఎప్పుడే జరిగాయంటే దాని వెనుక కచ్చితంగా కుట్ర ఉందనే అనుమానం తమకి కలుగుతుందని అన్నారు.
కేంద్ర నిఘా దర్యాప్తు సంస్థలు ఈ రెండు ఘటనలపై మీద విచారణ చేపట్టాలని వర్ల రామయ్య కోరారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకి వస్తాయని, ఆధారాలు కూడా దొరుకుతున్నాయని దేవినేని ఉమా అన్నారు. పోలీసుల ఫైఫల్యం స్పష్టంగా ఈ ఘటనలలో కనిపిస్తుందని, అంటే ఈ ఘటనలు జరుగుతాయని వారికి కూడా ముందే తెలిసి ఉంటుందని నారా లోకేష్ వ్యాఖ్యానించడం విశేషం. మరి టీడీపీ బయటపెడుతున్న కుట్ర కోణంపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.