unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 1 పూర్తి చేసుకుని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. సీజన్ 1 ఎంత పాపులర్ అయ్యిందో సీజన్ 2 అంతకు మించి పాపులర్ కాబోతోందని తొలి షోతోనే అర్ధమవుతోంది.ఇక సీజన్ 2 తొలి షోకి గెస్ట్‌లుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. రాజకీయ నాయకులు.. అందునా చంద్రబాబుకి అసలు నవ్వడమే తెలియదు. ఈ షోలో ఎలా ఉంటుందోలే అనుకుంటే తప్పులో కాలేసినట్టే.
ఈ షో అద్భుతంగా ఉండబోతోందని తాజాగా ఆహా విడుదల చేసిన ప్రోమోను బట్టి అర్ధమవుతోంది. ఈ ప్రోమో మొత్తం ఫుల్ జోష్‌తో సాగింది.వరల్డ్స్ బిగ్గెస్ట్ షోలలో ఒకటిగా నిలిచిన ఈ షో ఈ నెల 14 నుంచి ప్రారంభం కాబోతోంది.ఈ షోలో కాసేపు నారా లోకేష్ హోస్ట్‌గా మారారు.బాలయ్య, చంద్రబాబులను ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. దీంతో బాలయ్య తండ్రీకొడుకులు కలిసి తన సంసారంలో నిప్పులు పోస్తున్నారంటూ సెటైర్ వేశారు. ముందుగా బాలయ్యను తను కాసేపు హోస్ట్‌గా మారతానని లోకేష్ అడిగారు.
తొలుత ఇంట్లో కుకింగ్ మీ ఇద్దరిలో ఎవరు చేస్తారని బాలయ్యను లోకేష్ అడిగారు. సలహాలిస్తానని వంట చేయనని బాలయ్య చెప్పారు. అనంతరం ‘బావ మీరెప్పుడైనా వంట చేసి మా చెల్లెలికి పెట్టారా?’ అని చంద్రబాబును బాలయ్య అడిగారు. దీనికి‘నేనే వండుకోలేదు.. ఇంక ఆమెకి ఎక్కడ వండిపెడతా’ అని బాలయ్య సమాధానం ఇచ్చారు. ‘ఇద్దరిలో భార్య మాట ఎవరు ఎక్కువ వింటారు’అని లోకేష్ అడిగారు. ‘బ్లిక్‌లో ఓకే అనడానికి నా ఇగో ఒప్పుకోవడం లేదు అల్లుడు’అని బాలయ్య చెప్పారు.తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తారా? అనడంతో చంద్రబాబు కూడా నవ్వేశారు.