కోలీవుడ్ హీరో శింబు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో చేసిన మూవీ ‘మానాడు’ ని తెలుగులో ‘ది లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ మూవీలో శింబు సరసన కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీలో ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను టాలీవుడ్ హీరో నాని విడుదల చేశారు.
రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.