బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే దగ్గర అవుతుండడంతో సోషల్ మీడియాలో ఈ సీజన్ విన్నర్ ఎవరో అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ పోల్స్ లో సన్నీ భారీ లీడ్ తో ముందంజలో ఉన్నాడు.రెండవ స్థానంలో షన్ను కొనసాగుతున్నాడు.కానీ కొన్ని కథనాల మేర ప్రైవేట్ పోల్స్ లో భారీ ఆధిక్యాన్ని కనబరుస్తున్న సన్నీ బిగ్ బాస్ పోల్స్ లో మాత్రం షన్ను నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతుంది.ఇక వీటిని బట్టి చూస్తుంటే సీజన్ విన్నర్ టైటిల్ కు వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుందని సమాచారం.
అయితే బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ను ఈసారి గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం ఈ వీకెండ్ ప్రముఖులను హౌస్ కు గెస్ట్ లుగా పిలిచారని ప్రచారం జరగుతుంది.ఈరోజు గతంలో బిగ్ బాస్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరించిన నాని గెస్ట్ గా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి మరి వీటిలో నిజమెంత ఉందో తెలియాల్సివుంది.