ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎదగడం చాలా కష్టం ప్రస్తుత జనరేషన్ లో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నానినే ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొని నాచురల్ స్టార్ గా ఎదిగిన నాని కరోనా కారణంగా రెండుసార్లు ఓటిటిలో తన సినిమాలను రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోలేక విఫలం అయ్యారు.శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.
ఈ మూవీని ఓటిటిలో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు హడావిడి చేశారు. నానిని ఆయన చిత్రాలను బ్యాన్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే సురేష్ బాబు తను నిర్మించిన దృశ్యం 2 ను ఓటిటిలో విడుదల చేస్తామని ప్రకటిస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ సంఘాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి.ఈ ధోరణి పట్ల నెటిజన్స్ ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు.