Nandamuri Balakrishna: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో కొనసాగుతున్న బాలకృష్ణకు ఉన్న అభిమానగణం అంతా ఇంతా కాదు. తనదైన మార్క్ నటనతో అశేషమైన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఆయన పెంచుకున్నారు. పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో వెండితెరపై బాలయ్య చేసే రచ్చ మామూలుగా ఉండదు. అందుకే ఆయన నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
నాలుగు దశాబ్దాలుగా అభిమానుల గుండెల్లో గూడు కట్టుకొని ఉంటున్న బాలయ్య.. డైలాగ్ చెప్పాడంటే సింహం గర్జించినట్లే ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘పైసా వసూల్’, ‘అఖండ’ సినిమాల ద్వారా ఇది మరోసారి నిరూపితమైంది. ఇప్పుడాయన ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు.
సహాయ నటుడిగా సత్తా చాటాడు
ఇకపోతే, పద్నాలుగేళ్ల వయసులోనే ‘తాతమ్మ కల’ సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన బాలయ్య.. ఎంతవరకు చదువుకున్నారో తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంది. బాలకృష్ణ బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. నిజాం కాలేజీలోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగింది. బాల్యంలోనే సహాయ నటుడిగా పలు చిత్రాల్లో నటించిన బాలయ్య.. ‘దానవీరశూరకర్ణ’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘శ్రీమద్విరాట్ పర్వం’, ‘తిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ మూవీల్లో నటించి తన సత్తా చాటారు.
Nandamuri Balakrishna: తండ్రి సూచనతో పైచదువులు..
తండ్రి ఎన్టీఆర్ కు చదువులపై ఉన్న ఇష్టంతో బాలయ్యను డిగ్రీ దాకా చదివించారు. బీఏ చేయడం ఇష్టం లేకున్నా తండ్రి సూచనతో నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. బీఏ పూర్తి చేసి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. డిగ్రీ అయినా చదవకపోతే బాగోదనే ఎన్టీఆర్ మాటకు కట్టుబడి డిగ్రీ పూర్తి చేశారని తెలుస్తోంది.